రోడ్‌ టెర్రర్‌: ఇద్దరు యువకుల మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 10:55 AM IST
రోడ్‌ టెర్రర్‌: ఇద్దరు యువకుల మృతి

కరీంనగర్‌: నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం మరోకరిని ప్రాణాలను వదిలేలా చేస్తున్నాయి. ప్రమాదం జరిగితే పోయేది మనిషి ప్రాణం మాత్రమే కాదు ఒక కుటుంబ భవిష్యత్తు కూడా. వెరేవరో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల మరోకరు కన్నీళ్లు కార్చాల్సి వస్తోంది. తాజాగా కరీనంగర్ జిల్లాలోను నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులను లారీ ఢీకొట్టింది. అలుగునూరు వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కాగా ప్రమాదంలో యువకులు సాయి కిరణ్‌, సాయికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ అతివేగం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story