రోడ్‌ టెర్రర్‌: తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 10:57 AM GMT
రోడ్‌ టెర్రర్‌: తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి ..!

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌టేక్‌ చేయబోయిన బైక్‌ అదుపుతప్పి లారీ కింద పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. పెనుమూరు మండలం రాజాఇండ్లు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తండ్రి శ్రీను (35), అతని కుమారుడు(8), కుమార్తె (9) మృతి చెందారు. మృతులు తిరుపతిలోని జీవకోన వాసులుగా స్థానికులు గుర్తించారు. పెనుమూరులోని తమ తల్లిదండ్రులకు బిడ్డలను చూపించాలని బైక్‌పై పెనుమూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అటు పెనుమూరు, ఇటు జీవకోనలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it