కారును ఢీకొట్టిన వ్యాను.. 15 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

By సుభాష్  Published on  18 Jan 2020 4:27 AM GMT
కారును ఢీకొట్టిన వ్యాను.. 15 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

తమిళనాడులోని పుదువాయి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాను కారును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు సత్యవేడు మండలం రాజుగుంట వాసులుగా గుర్తించారు. పూల వ్యాపారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకున్నారు.

Next Story
Share it