ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచు ఎఫెక్ట్..!
By Newsmeter.Network Published on 14 Jan 2020 1:19 PM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన రాణిపేట జిల్లాలోని వాలాజపేట సమీపంలోని కస్టమ్స్ కార్యాలయం దగ్గర గల హైవేపై జరిగింది. దట్టంగా పొగమంచు కమ్ముకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రునుల స్థానికుల వెంటనే వాలాజాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం కారణంగా కిలీమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కదపబండంగల్ సుంగాచావాడి వద్ద వెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ లారీని ఢీకొట్టింది. దీంతో వెనుక నుండి వచ్చే వాహనాలు భారీ హిమపాతం కారణంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనపై వాలాజాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాణిపేట ఎమ్మెల్యే గాంధీ, మంత్రి నీలోఫర్ కపిల్ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రమాద బాధితులను పరామర్శించారు.