మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By అంజి  Published on  16 March 2020 2:43 AM GMT
మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ముఖ్యాంశాలు

  • లారీని ఢీకొన్న వ్యాన్‌.. ముగ్గురు మృతి
  • మృతులు దమ్మన్నపేట వాసులుగా గుర్తింపు
  • సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనక నుంచి ఓ ఓమ్ని వ్యాన్‌ ఢీ కొట్టింది. సోమవారం తెల్లవారుజామున నార్సింగ్‌ 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఓమ్ని వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Also Read: కేసీఆర్‌ నీ కౌంట్ డౌన్‌ స్టార్ట్‌ అయింది: బండి సంజయ్‌

మృతులు రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావు పేట మండలం దమ్మన్న పేట గ్రామానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దమ్మన్నపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read:యువకునిపై ఫిర్యాదు చేసిన అమృత

Next Story