ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. యాసిడ్‌ మీదపడి అడిట్‌ అధికారి మృతి

By Newsmeter.Network  Published on  31 Dec 2019 12:50 PM IST
ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. యాసిడ్‌ మీదపడి అడిట్‌ అధికారి మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నంలో మంగళవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై ఆగివున్న యాసిడ్‌ లారీని కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్‌-1 అడిట్‌ అధికారి అన్నదాత రాగమంజీర, ఆమె భర్తపై యాసిడి పడింది. దీంతో రాగమంజీరకు, ఆమె భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా రాగమంజీర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విశాఖపట్నం పెందుర్తికి చెందిన రాగ మంజీర ఇబ్రహీంపట్నం డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఆడిట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఆడిటర్‌ విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story