రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల వల్ల రహదారులన్ని రక్తసిక్తంగా మారుతున్నాయి. తాజాగా గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చుండూరు మండలం చినపరిమి సమీపంలో ఓ పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందితో వెళ్తున్న ఈ ట్రాక్టర్‌ తెనాలిలో పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చినపరిమి సమీపంలో మూలమలుపు వద్ద బోల్తా పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్

.

Next Story