ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
By సుభాష్ Published on 9 Oct 2020 10:18 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు జరిగింది. ఆలూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పొలం పనులు నిమిత్తం బైక్‌పై రావులపాలెంవైపు వెళ్తున్నవారిని రాజమహేంద్రవరం నంఉచి వేగంగా వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,మరో వ్యక్తి తీవ్ర గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులు మూలస్థాన అగ్రహారానికి చెందిన రాంప్రసాద్, శ్రీను, కర్రి విష్ణులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
నంద్యాల వైసీపీ నేత దారుణ హత్యNext Story