నంద్యాల వైసీపీ నేత దారుణ హత్య

By సుభాష్  Published on  9 Oct 2020 4:10 AM GMT
నంద్యాల వైసీపీ నేత దారుణ హత్య

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్‌సీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొన్నాపురం రేషన్‌ షాపు డీలర్‌ సుబ్బారాయుడు శుక్రవారం ఉదయం ఆయన వాకింగ్‌ వెళ్లి వస్తుండగా, కాపుకాసి ఉన్న దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. సుబ్బారయుడు రేషన్‌ డీలర్‌గా కాకుండానే న్యాయవాదిఆ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story
Share it