గుంటూరులో మరణ మృదంగం.. ఐదుగురు మృతి
By అంజి Published on 10 Feb 2020 11:56 AM IST
గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో, మినీ లారీ ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ఘటన ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హుటహూటిన గుంటూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి టీవీ9 ప్రతినిధి చెప్పారు. ఘటనా స్థలాన్ని పొలీసులు, రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించారు. మృతదేహాలను నర్సారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఓ మహిళ తోపుడు బండి నెట్టుకొస్తుండగా.. మహిళలను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆటోలో ఉన్న ప్రయాణికులందరూ ఫిరంగిపురం మండలానికి చెందినవారిగా గుర్తించారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. తొమ్మిదో తరగతి విద్యార్థి పెంచలకుమార్ మృతి చెందాడు.