ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
By సుభాష్ Published on 26 Dec 2019 1:38 PM GMT
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పీలేరు కలకడ రహదారిపై ఓ కారును ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మృతులంతా కడప జిల్లా రాయచోటికి చెందిన రషీద్, నజీబ్‌జాన్, హారూన్, ఖదీరున్నీసాలుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Also Read
నలుగురి ప్రాణాలను బలి తీసుకున్న అతివేగంNext Story