నలుగురి ప్రాణాలను బలి తీసుకున్న అతివేగం
By Newsmeter.Network Published on 25 Dec 2019 4:29 PM IST
మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో శంకర్, ఏడాది వయసున్న చిన్నారి మెగావర్శినిలు మృతి చెందారు. మరో ఇద్దరు జ్యోతి, నరేష్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుంతుండగా మృతి చెందారు. నసురుల్లాబాద్ నుంచి ఆటో జడ్చర్లకు వెళ్తుండగా ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. మృతులు భూత్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగం ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Next Story