క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్షా ముపై వేల‌కు పైగా మంది మృతి చెంద‌గా.. 26ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా పాజిటివ్ తో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మ‌న దేశంలో కూడా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దీని వ‌ల్ల మ‌నుషులు చ‌నిపోతుండ‌గా.. ప్ర‌కృతి మాత్రం పూర్వ రూపాన్ని సంత‌రించుకుంటుంది.

గంగానది ప్రక్షాళనకు ఇప్ప‌టికే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు వందల కోట్లు ఖ‌ర్చుపెట్టానా కానీ ప‌ని.. ఒక్క వైర‌స్ చేసింది. హ‌రిద్వార్ వంటి పుణ్య‌క్షేత్రాల నుంచి గంగానది ప్ర‌వ‌హిస్తుండ‌డంతో.. పుణ్య క్షేత్రాల‌కు వ‌చ్చే ల‌క్ష‌లాది భ‌క్తులు న‌దిలో వ్య‌ర్థాలు ప‌డేసేవారు. కొన్ని చోట్ల‌ వివిధ ప్యాక్ట‌రీల నుంచి వ‌చ్చే వ‌ర్థ్యాలు కూడా న‌దిలో కలిసేవి. దీంతో గంగాన‌ది విష‌పూరితంగా మారింది.

కరోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డం కోసం దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో.. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ర‌వాణా స‌దుపాయాలు కూడా నిలిపోవ‌డంతో.. భ‌క్తుల రాక త‌గ్గిపోయింది. ఫ‌లితంగా.. గంగానది నీళ్లు తాగేంత ప‌రిశుభ్రంగా మారాయి. ఇంకా చెప్పాలంటే పై నుంచి చూస్తే.. నీటిలోని చేప‌లు సైతం స్ప‌ష్టంగా క‌నిపించేంత‌గా స్వ‌చ్ఛంగా న‌దీజ‌లాలు ప‌రిశుభ్ర‌మ‌య్యాయి.

దాదాపు నెల రోజుల నుంచి భ‌క్త‌లు హ‌రిద్వార్‌కు రాక‌పోవ‌డంతో.. అక్క‌డ గంగా న‌ది నీటి పీహెచ్ శాతం అదుపులోకి వ‌చ్చింద‌ని ఇక్క‌డి నీటిని ప‌ర్యావ‌ర‌ణ విభాగం.. క్లాస్ ఏ విభాగంలో చేర్చింది. క్లాస్ ఏలో ఉండే నీటి పీహెచ్ శాతం 6.5 నుంచి 8.5 మ‌ధ్య‌లో ఉండాలి. కాగా..ప్ర‌స్తుతం గంగా న‌దీ జ‌లాల పీహెచ్ శాతం 7.4గా ఉన్న‌ట్లు ప‌ర్యావ‌ర‌ణ విభాగం పేర్కొంది.

క‌రోనా వైర‌స్ మాన‌వాళీకి ముప్పుగా ప‌రిణ‌మించినా.. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం ప‌రిశుభ్రంగా మారుతుంది. ఒక్క గంగాన‌ది మాత్ర‌మే కాదు.. దేశంలోని చాలా న‌దులు ప‌రిశుభ్రంగా మారిపోయాయి. వీటిని కాపాడుకుంటే.. మంచినీటిని స‌మ‌స్య‌ల‌తో పాటు చాలా స‌మ‌స్య‌ల‌ను అదిగ‌మించ‌వ‌చ్చు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.