క‌రోనా వైర‌స్ భార‌త దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశంలో అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులు మ‌హ‌రాష్ట్ర‌లో న‌మోద‌య్యాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి దాటికి దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబాయి న‌గ‌రం చిగురుటాకులా వ‌ణుకుతోంది. తాజాగా ముంబాయిలో 50 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు బీఎంసీ(బృహ‌న్ ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్) అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 16,17 తేదీల్లో బీఎంసీ ఆధ్వ‌ర్యంలో స్థానిక ఆజాద్ మైదానంలో క‌రోనా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 170 మంది జ‌ర్నలిస్టుల నుంచి శాంపిల్స్‌ను సేక‌రించి క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. వీరిలో53 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. అయితే.. వీరిలో ఎవ‌రికీ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. దీంతో అధికారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క‌రోనా బారీన ప‌డిన వారిలో ఫీల్డ్‌లో ప‌ని చేసే రిపోర్ట‌ల్లే ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం వారంద‌రినీ ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. వీరితో స‌న్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్ కు త‌ర‌లించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.