హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ సులభ్‌ కాంప్లెక్స్‌లో రెండు గన్‌లు ఉండడం స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్వహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు గన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. అవి గన్‌లు కాదని తపంచాలని తెలిపారు. వీటిని ఇక్కడ వదిలి పెట్టిన వారి కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితుల కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు తపంచాలలను సులభ్‌ కాంప్లెక్స్‌ దాచిపెట్టినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు పట్టుబడతామనే భయంతోనే వాటిని వారు తంపచాలను ఇక్కడ వదిలారని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని డీసీపీ విశ్వప్రసాద్‌, సైఫాబాద్‌ డివిజన్‌ ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా పరిశీలించారు. సులభ్‌ కాంప్లెక్స్‌లో స్నానం చేయడానికి వచ్చిన ప్రయాణికులే ఇక్కడ వదిలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు తపంచాలపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.