రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టూ వీలర్ పై ప్రగతి భవన్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు
పోలీసుల కళ్లుగప్పి బుల్లెట్ పైన ప్రగతి భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి . ప్రగతి భవన్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు. తన ఇంటి నుంచే రేవంత్ రెడ్డి బయటకు బయటికి వచ్చాడు. అప్పటికే తన కార్యకర్త బుల్లెట్ వాహనాన్ని సిద్ధం చేశాడు. ఇంట్లో బుల్లెట్టు వాహనం వెనుక లెక్కేసి పోలీసులు అడ్డుకుంటున్న బుల్లెట్ వాహనంపై అత్యంత వేగంగా తప్పించుకొని ప్రగతి ప్రగతి భవన్ వైపు వచ్చాడు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
�
కేసీఆర్ ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి ట్వట్ చేశారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్దార్ అంటూ ట్వట్ చేశారు రేవంత్. అంజన్ యాదవ్, రాముల నాయక్ అక్రమ అరెస్ట్ లు ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే అర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
పీఎస్ నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి
�