రాజకీయ పార్టీల వైపు చూడకండి : ఎంపీ రేవంత్‌ రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2019 2:16 PM GMT
రాజకీయ పార్టీల వైపు చూడకండి : ఎంపీ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రెండు రోజులు డిపోకు రాలేదని ఉద్యోగులను తీసేస్తే ..మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలి? పీడీ యాక్ట్‌ పెట్టాలా అని మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌ రెడ్డితో పాటు ఆర్‌. కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో చనిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఆర్ధికంగా బలహీనుడు కాదని, ఉద్యోగ భద్రత గురించి ఆందోళనే అతని మృతికి కారణమని చెప్పారు.మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖం చెల్లక ముఖ్యమంత్రి ప్రెస్‌నోట్లు రిలీజ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. సమ్మె చట్టబద్ధంగా జరుగుతుంటే ఆట మధ్యలో గేమ్‌ రూం మారుస్తామంటే కుదరదని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని అనుమానం వ్యక్తం చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి.

Next Story