అక్కడ వరుస పేలుళ్లు.. ఇక్కడ రిపబ్లిక్‌ డే వేడుకలు

By అంజి  Published on  26 Jan 2020 4:22 AM GMT
అక్కడ వరుస పేలుళ్లు.. ఇక్కడ రిపబ్లిక్‌ డే వేడుకలు

ఢిల్లీ: రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ ప్రజలందరూ ఒకరికొకరు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షాలు తెలుపుకుంటున్నారు. 1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తి అయ్యింది. ఢిల్లీలో ఈ వేడుకలు భారీ భద్రత మధ్య జరుగుతున్నాయి. ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్‌కు మొదటి నుంచి బ్రెజిల్‌ మిత్రదేశంగాను ఉంటూ వస్తోంది. శనివారం నాడు రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. జాతీయ జెండాకు భారత సైనికులు వందనాలు సమర్పిస్తున్నారు.



అసోంలో రిపబ్లిక్‌ డే రోజున వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. డిబ్రూగర్‌ జిల్లాలోని బజార్‌, గురుద్వారా గ్రామాల్లో పేలుళ్లు సంభవించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. దీంతో అసోం యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న బలగాలు వెంటనే ఘటాన స్థలాలకు చేరుకున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ భాస్కర్‌ జ్యోతి మెహంత్‌ తెలిపారు.



విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story