జీవితా రాజ‌శేఖ‌ర్ చేతుల మీదుగా రిలీజైన‌ 'కలియుగ' ప్ర‌మోష‌న‌ల్ సాంగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 8:18 AM GMT
జీవితా రాజ‌శేఖ‌ర్ చేతుల మీదుగా రిలీజైన‌ కలియుగ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్

బాలాజీ సిల్వర్ స్క్రీన్ పతాకంపై స్వాతి దీక్షిత్' సై సూర్య, శశి. విశ్వ.రాజా. ప్రభాస్ శ్రీను. తాగుబోతు రమేశ్ ప్రదాన పాత్రల లో తెరకెక్కిన చిత్రం 'కలియుగ'. ఈ చిత్రానికి తిరుపతి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు పూర్తి చేసుకుని U/A" సెన్సార్ సర్టిఫికెట్ అందుకుని విడుదల కు సిద్దమైనది. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునె కథనంతో రూపొందుతున్న 'కలియుగ' చిత్రాన్ని ప్రస్తుతం సమాజంలో ఉన్న వాస్తవాలకి దగ్గరగా ఉండేలా... అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా తెరకెక్కించాం. ఈ చిత్రంలో సూర్య నటన హైలెట్ గా ఉంటుంది. టెక్నికల్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. ముందుగా ఈ చిత్ర ప్రమోషన్ సాంగ్ ను ప్రముఖ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ విడుదల చేశారు.

అనంతరం జీవిత‌ మాట్లాడుతూ... 'కలియుగ' చిత్ర ప్రమోషన్ సాంగ్ రిలీజ్ చేయటానికి కారణం సూర్య.. మాకు సూర్య ఎప్పటినుండో తెలుసు రాజశేఖర్ గారికి తమ్ముడి గా నటించాడు. సినిమా తీసి రిలీజ్ చేయటం మాలాంటి వాళ్ళకి చాలా కష్టం. అయినా సరే సూర్య సినిమా తీసి డిసెంబరు మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నాడు. ట్రైలర్స్ లో వల్గారిటి ఎక్కువ చూపించి ప్రేక్షకుల ను థియేటర్లకు రప్పించి క్యాష్‌ చేసుకునే ఈ సమయంలో ... ఆడవారి పై జరుగుతున్న అన్యాయాల పై ప్రతీకారం తీర్చుకునే కథ తో ముందుకు రావటం చాలా గొప్ప విషయం. ఆడవారి భద్రత కొసం కేంద్ర పరిధి లో రాష్ట్ర పరిధి లో ఎన్ని చట్టాలని తెచినా జరిగే అన్యాయాలు జరుగుతునే ఉన్నాయి. సూర్య సినిమా రూపంలో ఆడవాళ్ల సమస్యని మనముందుకు తీసుకొస్తునందుకు సుర్యని అభినంధి స్తున్నాను. ఈ సినిమాను అందరూ ఆదరించి మంచి విజయం సాధించాలని.. సూర్యకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నరు

Next Story