విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
By Newsmeter.Network Published on 12 March 2020 6:35 AM GMTఅధికార వైసీపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడును ప్రదర్శిస్తుంది. అభ్యర్థుల ప్రకటించే విషయంలోనూ, వారిని గెలిపించుకొనేందుకు చేపట్టాలని చర్యలు, వ్యూహాల్లోనూ వేగంగా దూసుకెళ్తుంది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఇక కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను గురువారం 48మందితో తొలిజాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ నేత దాడి వీరభద్రరావులు ప్రకటించారు. జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.
తొలిజాబితాలో అభ్యర్థులు వీరే..
విశాఖ నార్త్ 44వ డివిజన్ - శ్రీనివాసరావు, 25వ డివిజన్ - లీలావతి, విశాఖ నార్త్ 46వ డివిజన్ - కె.సతీష్, 49వ డివిజన్ - అల్లు శంకరరావు, విశాఖ ఈస్ట్ 9వ డివిజన్ - కె.స్వాతి, 11వ డివిజన్- హరికుమార్, 15వ డివిజన్ - ఎన్.రేవతి, 18వ డివిజన్ - ధనలక్ష్మి, 20వ డివిజన్ - ఎన్.లక్ష్మి, 21వ డివిజన్ - వంశీకృష్ణ, 22వ డివిజన్- పి.గోవింద్, 23వ డివిజన్- జి.విజయసాయి, 52వ డివిజన్ - జి.శ్రీధర్, 60వ డివిజన్ - డీవీ సురేష్, 91వ డివిజన్ - జ్యోత్స్న, 92వ డివిజన్ - స్వర్ణలత శివదేవి, విశాఖ వెస్ట్ 40వ డివిజన్ - నాగేశ్వరరావు, విశాఖ సౌత్ 27వ డివిజన్ - సర్వేశ్వర్‌రెడ్డి, 29వ డివిజన్ నారాయణరావు, 31వ డివిజన్ - బత్తిన నాగరాజు, 32వ డివిజన్ రామరెడ్డి, 33వ డివిజన్ - బచ్చినపల్లి లక్ష్మి, 35వ డివిజన్ కనకనాథ్‌రెడ్డి, 37వ డివిజన్ - వడ్డాది రాజు, 38వ డివిజన్ - సత్యరూప వాణి పేర్లను వెల్లడించారు. మిగిలిన వారిని జాబితాను త్వరలో వెల్లడిస్తామని అవంతి తెలిపారు.
ఇదిలా ఉంటే టికెట్లు దక్కని ఆశావహులు ఆందోళనకు దిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాము పార్టీకోసం కష్టపడుతున్నామని, అలాంటిది మాకు కాకుండా వేరేవాళ్లకు టికెట్లు ఇవ్వటం సరికాదంటూ ఆందోళనకు చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో నేతలను నిలదీశారు. మధురవాడలో పార్టీకోసం కష్టపడిన వైసీపీ నాయకులను మంత్రి అవంతి పక్కన పెట్టారని ఆందోళన నిర్వహించారు. మళ్ల విజయ్ ప్రసాద్ బంధువుకు సీటు ఇవ్వడంపై పలువురు వైసీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే కార్పొరేటర్ల జాబితాను అవంతి శ్రీనివాస్‌రావే ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ విజయసాయి రెడ్డి వర్గీయులు పలువురు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.