ఆగస్ట్‌ 12 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ

By సుభాష్  Published on  26 Jun 2020 10:16 AM IST
ఆగస్ట్‌ 12 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12 వరకు మెయిల్‌, ఎక్స్‌ ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్లు వంటి రెగ్యులర్‌ ప్రయాణికుల సర్వేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 12 మధ్య బుక్‌ చేసుకున్న రైల్వేటికెట్లన్ని రద్దవుతాయని వెల్లడించింది. టికెట్లు రద్దయిన వారందరికి రీఫండ్‌ చేయనున్నట్లు తెలిపింది.

అయితే కరోనా కట్టడిలో మార్చి నెలలో విధించిన లాక్‌డౌన్‌ నిర్ణయంతో అన్ని రెగ్యులర్ ప్యాసింజర్‌ రైలు సర్వీసులను రైల్వేశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందిఏ. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రద్దు కొనసాగనుంది. అయితే ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా వైరస్‌ కట్టడిలోకి రాకపోవడంతో రైళ్ల రద్దునును జూన్‌ 30 వరకు పొడిగించింది. ఇక దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ రైళ్లను రద్దును పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాగా, వలస కూలీలను తరలించేందుకు మాత్రం శ్రామిక్‌ రైళ్లు, మరికొన్ని ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడవనున్నాయి.

Next Story