నూతన భవనంలో యూనిమోని తిరుపతి శాఖ ప్రారంభోత్సవం
భారతదేశంలోని ప్రముఖ నాన్- బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC),ఫారిన్ ఎక్స్చేంజ్ మరియు నగదు బదిలీ సేవలు అందించే యూనిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తమ శాఖను
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2024 11:30 AM GMTభారతదేశంలోని ప్రముఖ నాన్- బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC),ఫారిన్ ఎక్స్చేంజ్ మరియు నగదు బదిలీ సేవలు అందించే యూనిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తమ శాఖను తిరుపతి లో కస్టమర్ల యొక్క సౌకర్యార్థం అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతానికి మార్చింది, ఈ నూతన శాఖ మొదటి అంతస్తు, డి మార్ట్ ఎదురుగ, ఎయిర్ బై పాస్ రోడ్, యాదవ కాలనీ రాయల్ నగర్, తిరుపతి వద్ద ఉంది
ఈ ప్రారంభోత్సవ వేడుకకు యూనిమోని ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఏ కృష్ణన్ ఆర్ హాజరయ్యారు ఆయనతో పాటుగా శ్రీ మనోజ్ వి మ్యాథ్యు (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ), శ్రీ రతీష్ ఆర్ (చీఫ్ పీపుల్ ఆఫీసర్ ), శ్రీ ప్రకాష్ భాస్కర్ (నేషనల్ బిజినెస్ హెడ్ ఫారెక్స్ ), శ్రీ జాన్ జార్జ్ (నేషనల్ బిజినెస్ హెడ్ ట్రావెల్ అండ్ హాలిడేస్) శ్రీ టైటస్ కే (నేషనల్ బిజినెస్ హెడ్ గోల్డ్ లోన్ ),శ్రీ శ్రీనివాస్ రెడ్డి (జోనల్ హెడ్ ఆంధ్ర,తెలంగాణ ), శ్రీ వెంకటసుబ్బయ్య (రీజినల్ హెడ్ విజయవాడ ), మరియు శ్రీ సిద్ద ప్రసాద్(బ్రాంచ్ హెడ్ తిరుపతి ) కూడా హాజరు ఐయ్యారు
యూనిమోని ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సీఏ కృష్ణన్ ఆర్ మాట్లాడుతూ ఈ శాఖను మరో చోటుకు బదిలీ చేయడానికి వెనుక గల కారణాలను తెలిపారు " కస్టమర్ల సేవ మరియు లభ్యతను మెరుగుపరచడానికి కోసం మేము మా తిరుపతి శాఖను అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశానికి మార్చమని, మా యొక్క కొత్త శాఖ తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మా కస్టమర్లకు మెరుగైన సేవలని మరియు ఆర్థిక మద్దతును అందించడం లో మా నిబద్ధతను సూచిస్తుందని ఈ కొత్త లొకేషన్ లో అందుబాటులో ఉన్న మా కార్యలయంలో అత్యాధునిక సేవలతో మా కస్టమర్లు ప్రయోజనం పొందుతారని మేము నమ్ముతున్నాము " అని అన్నారు
ఇట్టి ప్రారంభోత్సవం లో కంపెనీ 'స్టూడెంట్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగామ్ 'లో 2 వ బహుమతి విజేత అయిన శ్రీ నక్కా సాయిమానిశాంత్ కు యూనిమోని రూ .1.5 లక్షల ప్రైజ్ మనీని అందించింది .
స్టూడెంట్స్ స్టార్" అనేది స్కాలర్షిప్ & రివార్డ్ ప్రోగ్రాం అని, విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్న విద్యార్థులు మరియు విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి స్కాలర్షిప్ అందించాలని మంచి ఆలోచనతో కంపనీ ఈ ప్రోగ్రాం ని జనవరి 2023 లో మొదటి విడతగా ప్రారంభించిందని తెలిపారు, ఇట్టి యూనిమోని స్టూడెంట్ స్టార్ ప్రోగ్రాం కి విద్యార్థులు నుండి మరియు వారి తల్లిదండ్రుల నుండి అనూహ్య స్పందన వచ్చిందని, ఊహించిన దానికంటే ఎక్కువ విద్యార్థులు మా కంపెనీ లో స్కాలర్ షిప్ కోసం వారి వివరాలని నమోదు చేసుకున్నారని మరియు త్వరలో మా 2 వ విడతగా మరింత ఎక్కువ స్కాలర్షిప్ తో మీ ముందుకు వస్తామని సి ఏ కృష్ణన్ అన్నారు.
సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సి ఎస్ అర్) భాగంగా తిరుపతి లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులకు స్కూల్ బాగ్స్ లని అందచేశారు, సమాజం లోని పిల్లల విద్య మరియు మంచి శ్రేయస్సు కోసం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
యూనిమోని కంపెనీ దాని కార్పొరేట్ సామాజిక భాద్యతలో సమాజానికి సేవ చేసే కార్యక్రమాలలో ముందుంటుందని తెలిపారు.
మా యొక్క యూనిమోని ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ NBFC రంగంలో అగ్రగామి సంస్థగా ఉద్భవించింది, ఆర్థిక రంగంలో అత్యంత నమ్మకమైన మరియు పారదర్శకమైన సేవలని అందిస్తుంది. మా యొక్క సేవలు విదేశీ కరెన్సీ సేవలు,విదేశాలకి నగదు పంపించడం,విదేశీ కరెన్సీ కార్డు, బంగారు ఆభరణాలపై రుణాలు,విమాన ప్రయాణ టికెట్స్ మరియు టూర్స్, నగదు బదిలీ, వినియోగ చెల్లింపులు మరియు భీమా సౌకర్యం. భారత దేశంలో 25 సంవత్సరాలకు పైగా 300 బ్రాంచ్ ల ద్వారా అంకితమైన సేవలతో మరియు నైపుణ్యం చెందిన సిబ్బందితో సేవలు అందిస్తుంది.
మరింత సమాచారం కోసం దయచేసి https://www.unimoni.in/ లో మా వెబ్ సైట్ ను సందర్శించండి లేదా 1800 102 0555 కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి.