హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు షాక్ ఇచ్చాడు ఓ వాహన‌దారుడు. ఈ రోజు త‌నిఖీల‌లో ప‌ట్టుబడ్డ ఆ వాహ‌న‌దారుడుకు పోలీసులు అంత‌కుముందు ఏకంగా 75 ట్రాఫిక్ చ‌లాన్‌లు విధించారు. అయినా వాటిని చెల్లించ‌కుండా ఆ వాహ‌న‌దారుడు య‌థేచ్చ‌గా తిరుగుతున్నాడు. ఈ ఉద‌యం బంజారాహిల్స్.. శ్రీనగర్ కాల‌నీ ట్రాఫిక్ త‌నిఖీల‌లో ప‌ట్టుబ‌డ్డ అత‌డికి మ‌రోమారు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.