వెండితో తయారు చేసిన రూ.250 నాణేన్ని ఆర్బీఐ విడుదల చేసింది. రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నాణేన్ని ముద్రించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే..ఇది భారత పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావట్లేదట. కేవలం రాజ్యసభ సభ 250వ సమావేశాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ సభ్యులకు మాత్రమే పంపిణీ చేసేందుకు ముద్రించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.

Also Read : ఇంత ఆల్కహాల్ నేనెప్పుడూ తీసుకోలేదు : కాజల్

ప్రత్యేకంగా ముద్రించిన ఈ నాణెం ముందు భాగంలో సారనాథ్ సింహాల చిత్రం, కాయిన్ విలువను ముద్రించగా.. వెనుకవైపు రాజ్యసభ 250 సెషన్, గాంధీ బొమ్మను, 250 చుక్కలను ముద్రించారు. ఈ నాణేన్ని ప్రజా వినియోగానికి ఉపయోగించరాదని ఆర్బీఐ అధికారులు తెలిపారు. గురువారం రాజ్యసభ సమావేశాలు ముగిశాక సభ్యులకు ఈ నాణేలను పంపిణీ చేయనున్నారు.

Also Read : లక్షల్లో లాటరీ గెలిచాడు.. కానీ ఏం లాభం!

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.