దేశ ఆర్థిక రంగం కుదేలైంది : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్

By రాణి  Published on  16 March 2020 6:15 PM IST
దేశ ఆర్థిక రంగం కుదేలైంది : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్

ముఖ్యాంశాలు

  • రెండ్రోజుల్లో ఎస్ బ్యాంక్ పై మారటోరియం ఎత్తివేత
  • 26 నుంచి కొత్త యాజమాన్యం

ఎస్ బ్యాంక్ ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతాదాస్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన..బుధవారం నుంచి ఎస్ బ్యాంక్ పై విధించిన మారటోరియంను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులు ఒకేసారి నగదు మొత్తాన్ని విత్ డ్రా చేయరాదని సూచించారు. కరోనాతో ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిందని..అందుకే ఒకేసారి పెద్దమొత్తంలో నగదును విత్ డ్రా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డిపాజిటర్లు కూడా తమ డబ్బు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Also Read : ఎస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్‌ బ్యాంకులు

ఎస్ బ్యాంక్ కొత్తబోర్డు ఈ నెల 26వ తేదీన బాధ్యతలు స్వీకరించనుందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కరోనా కారణంగా..విమానయాన, టూరిజం రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఆర్థిక రంగం కుదేలయిందన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ బ్యాంక్ లే కీలక పాత్ర వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. నగదు కొరత తీరాలంటే డిజిటల్ లావాదేవీలు పెరగాలని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతాదాస్ పేర్కొన్నారు.

Also Read : యెస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

కొద్దిరోజుల క్రితం ఎస్ బ్యాంక్ అధిక వడ్డీలకు ఆశపడి కోటానుకోట్లు వ్యాపారులకు లోన్ల రూపంలో ఇచ్చి..తిరిగి వసూలు చేయలేక చేతులెత్తేసింది. అప్పట్నుంచీ ఎస్ బ్యాంక్ స్కామ్ లు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పరిశీలించిన ఆర్బీఐ ఎస్ బ్యాంక్ పై మారటోరియం విధించింది. ఈ విషయం తెలిసిన ఖాతాదారులు, డిపాజిటర్లు ఎస్ బ్యాంక్ బ్రాంచ్ ల ఎదుట బారులు తీరారు. ఆ సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల డబ్బు ఎక్కడికీ పోదని హామీ ఇచ్చారు.

Also Read : భారీగా తగ్గిన బంగారం ధర

Next Story