Fact Check : రతన్ టాటా ఆ మాటలు చెప్పారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 May 2020 12:49 PM ISTప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చెప్పిన కొటేషన్స్ అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అవి రతన్ టాటా చెప్పాడో కూడా క్లారిటీ ఉండదు కానీ.. ఓ కొటేషన్ కింద రతన్ టాటా పేరు.. మరో వైపు రతన్ టాటా ఫోటో ఉంటుంది. ఇవే కాదు ఆయన మీద చాలా తప్పుడు వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు రతన్ టాటా తన అఫీషియల్ సైట్స్ లో ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు అని చెప్పుకొస్తూ ఉంటారు.
తాజాగా రతన్ టాటా చెప్పారు అన్నట్లుగా ఇంకో వార్త వైరల్ అవుతోంది. పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్ సైట్స్ కూడా రతన్ టాటా వ్యాఖ్యలు అంటూ ఓ ఆర్టికల్ ను ప్రముఖంగా ప్రచురించాయి.
नमस्कार सम्मानित साथियों। वर्ष 2020 जीवित रहने का साल है ना की लाभ -हानि की गणना करने का या चिंता करने का। यह बात सम्मानित रतन टाटा ने अपने संदेश में 100% सही कही है। आइए- लॉक डाउन का पालन करते हुए अपने सभी भाई बंधुओं रिश्ते नाते दारों के बीच सतर्क रहें! सुरक्षित रहें! घर पर रहे! सामाजिक दूरी का पालन करें! मास्क पहने!तभी हम वर्ष 2021 में अपनों के साथ अपना जन्मदिन मना पाएंगे। -परम पिता परमेश्वर से इसी कामना के साथ आपका दोस्त”
ఈ వార్త ఏమిటంటే "2020 సంవత్సరం అన్నది కేవలం సర్వైవల్(బతికి బట్ట కట్టడం) కోసమే అని.. లాభాలు నష్టాలు అన్నవి పట్టించుకోరాదు. మనం బ్రతికి ఉన్నామా లేదా అన్నది మాత్రమే ముఖ్యమైనది.. ప్రస్తుతం ప్లాన్స్ గురించి, డ్రీమ్స్ గురించి ఆలోచించరాదు. జాగ్రత్తగా ఉండండి ఈ లాక్ డౌన్ సమయంలో.. ఇళ్లల్లో ఉండండి.. సామాజిక దూరాన్ని పాటించండి.. మాస్కులు తప్పకుండా వాడాలి. అప్పుడు మాత్రమే 2021 ని మనం ప్రేమించిన వారితో జరుపుకోగలం" అని రతన్ టాటా అన్నారు.
దీన్ని లోకల్ న్యూస్ మీడియా వెబ్ సైట్ 'దైనిక్ సవేరా' కూడా పబ్లిష్ చేసింది. దేశ ప్రజలకు రతన్ టాటా ఇస్తున్న సలహా అంటూ మే 3న యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.
ప్రభాత్ ఖబర్ హిందీ ఎడిషన్ కూడా మే 3న ఈ వార్తలను కవర్ చేసింది.
అదే పోస్టును పలువురు ట్విట్టర్ యూజర్లు తమ తమ ఖాతాల్లో షేర్ చేశారు.
నిజమెంత:
రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వ్యాఖ్యలు తాను చేసినవి కావని.. మరోసారి నేను చెప్పని విషయాలను తన ఖాతాలో వేశారని అన్నారు. ఈ నకిలీ వార్తలు వైరల్ చేయడాన్ని ఇకనైనా ఆపాలని ఆయన కోరారు. ఏదైనా ఒక వార్త కానీ, కొటేషన్ పక్కన కానీ నా ఫోటో ఉన్నంత మాత్రాన నేను చెప్పింది అని అనుకోకూడదని నెటిజన్లను తెలిపారు. ఇకనైనా ఈ ఫేక్ వార్తలను ప్రచారం చేయడం ఆపాలని కోరారు. తాను ఏదైనా చెప్పాను అంటే ప్రముఖ వార్తా సంస్థలను చూసి నిజమా కాదా అని తెలుసుకోవాలని అన్నారు.
ఎకనామిక్ టైమ్స్, హిందూస్తాన్ టైమ్స్ సంస్థలు కూడా రతన్ టాటా చెప్పలేదని ధృవీకరించాయి.
కాబట్టి రతన్ టాటా చెప్పాడంటూ వైరల్ అవుతున్న వార్త 'పచ్చి అబద్దం'