హైద‌రాబాద్‌లో రాష్ట్ర‌ప‌తి నిల‌యాన్ని సంద‌ర్శ‌కులు సంద‌ర్శించేందుకు అనుమ‌తి ఇచ్చారు. ప్ర‌తియేటా రాష్ట్ర‌ప‌తి శీతాకాల విడిది ముగిసిన త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి నిల‌యాన్ని సంద‌ర్శించేందుకు అనుమ‌తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది కూడా బొల్లారంలో ఉన్న రాష్ట్ర‌ప‌తి నిల‌యాన్ని చూడాల‌నుకునేవారికి అధికారులు అవ‌కాశం క‌ల్పించారు. కాగా, డిసెంబ‌ర్ 28 వ‌ర‌కు భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ స‌తీస‌మేతంగా బ‌స చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 2వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి నిల‌యాన్ని సంద‌ర్శించేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఈ చారిత్ర‌క భ‌వ‌నాన్ని చూడాల‌నుకునే వారికి ఈ అవ‌కాశం క‌ల్పించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.