రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి
By సుభాష్ Published on 2 Jan 2020 9:04 AM GMTహైదరాబాద్‌లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకులు సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతియేటా రాష్ట్రపతి శీతాకాల విడిది ముగిసిన తర్వాత రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని చూడాలనుకునేవారికి అధికారులు అవకాశం కల్పించారు. కాగా, డిసెంబర్ 28 వరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీసమేతంగా బస చేశారు. ఈ సందర్భంగా జనవరి 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ చారిత్రక భవనాన్ని చూడాలనుకునే వారికి ఈ అవకాశం కల్పించారు.
Next Story