Fact Check : దీపిక పదుకోన్ తో కలిసి ఎన్సీబీ అధికారుల ముందు హాజరవుతానని రణవీర్ సింగ్ కోరాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sept 2020 5:21 PM IST
Fact Check : దీపిక పదుకోన్ తో కలిసి ఎన్సీబీ అధికారుల ముందు హాజరవుతానని రణవీర్ సింగ్ కోరాడా..?

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగంపై విచారణ చేస్తూ ఉన్నారు ఎంతో మంది నటీనటులకు సమన్లను జారీ చేశారు. బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ ను కూడా విచారించారు. విచారణ సందర్భంగా దీపిక చెప్పిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తికి గురయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కరిష్మా ప్రకాశ్ తో తనకు సాధారణ సంబంధాలే తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక తెలిపింది. అయితే ఎన్సీబీ అధికారులు ఆమె వాదనలపై అనుమానం వ్యక్తం చేశారని బాలీవుడ్ మీడియా చెబుతోంది.



దీపికతో పాటు తాను కూడా విచారణకు వస్తానని ఆమె భర్త రణవీర్ సింగ్ తమను అభ్యర్థించినట్టు ప్రచారం జరుగుతోంది. దీపిక విచారణలో ఒత్తిడికి గురయ్యే అవకాశముందని, అందుకే తాను కూడా ఆమె పక్కనే ఉండాలనుకున్నట్టు రణవీర్ ఎన్సీబీ అధికారులను కోరారంటూ కథనాలను ప్రచారం చేస్తూ ఉన్నారు.

దీపికకు యాంగ్జైటీ సమస్యలు ఉన్నాయని.. అందుకే తాను కూడా భార్యతో కలిసి హాజరవుతానని చెప్పాడంటూ చాలా మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. Republic TV, DNA, Times of India మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రసారం చేశాయి. పలువురు నెటిజన్లు కూడా సామాజిక మాధ్యమాల్లో రణవీర్ కు సంబంధించిన పోస్టులు పెట్టారు.



నిజ నిర్ధారణ:

దీపిక పదుకోన్ తో కలిసి ఎన్సీబీ అధికారుల ముందు హాజరవుతానని రణవీర్ సింగ్ కోరాడన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

కీవర్డ్స్ ను ఉపయోగించి పలు రిజల్ట్స్ ను వెతకగా అందులో India Today కు సంబంధించిన కథనాన్ని చూడొచ్చు. అందులో ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ “There are questions whether Ranveer Singh is joining the investigation with Deepika Padukone. We confirm that we have not received any such request from any summoned person. The last email received from the concerned summoned person is only regarding joining the investigation.” ఈ వ్యాఖ్యలు చేశారు. దీపికతో పాటు తాను కూడా విచారణకు వస్తానని ఆమె భర్త రణవీర్ సింగ్ తమను అభ్యర్థించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఎన్సీబీ అధికారులు చెప్పుకొచ్చారు. దీపిక విచారణలో ఒత్తిడికి గురయ్యే అవకాశముందని, అందుకే తాను కూడా ఆమె పక్కనే ఉండాలనుకున్నట్టు రణవీర్ తమను కోరాడనడంలో నిజంలేదని ఎన్సీబీ అధికారులు తేల్చి చెప్పారన్నది ఈ కథనంలో తెలిపారు.

The Free Press Journal కూడా కూడా ఈ కథనాల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఎన్.సి.బి. డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా కూడా తమకు దీపిక భర్త నుండి అటువంటి అభ్యర్థన రాలేదని అన్నారు.

దీపిక పదుకోన్ తో కలిసి ఎన్సీబీ అధికారుల ముందు హాజరవుతానని రణవీర్ సింగ్ కోరలేదు.

Next Story