అయోధ్యలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. భూమి పూజకు అతిథుల సంఖ్య కుదింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 8:37 PM IST
అయోధ్యలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. భూమి పూజకు అతిథుల సంఖ్య కుదింపు

కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థానంగా బావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబువుతోంది. భూమి పూజ కోసం చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా ప్రబలుతున్న వేళ అయోధ్య రామమందిరం నిర్మాణ శంకుస్థాపనకు పిలిచే అతిథుల సంఖ్య 200 నుంచి 170కి తగ్గించినట్లు తెలుస్తోంది.

బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మురళీ మనోహర్‌‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు. భూమి పూజ చేసే దగ్గర ప్రధాని మోడీతో పాటు ఆర్‌‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామ్‌జన్మభూమి న్యాస్‌ చీఫ్‌ నృత్య గోపాల్‌ దాస్‌లు మాత్రమే ఉంటారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు చెప్పారు. శ్రీశ్రీ రవిశంకర్‌‌, మోరారీ బాపూ, ఆచార్య నరేంద్ర గిరి, జగద్గురు స్వామి వాసుదేవనన్‌ సరస్వతి, స్వామి వాసుదేవనన్‌, సరస్వతిని కూడా భూమి పూజకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

రామ మందిరం భూమి పూజ నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు అవుతుండడంతో.. భూమి పూజకు రెండు రోజులు, ఆరో జు అయోధ్యలో చేపట్టబోయే భద్రతా చర్యలపై నగర రేంజ్‌ డీఐజీ దీపక్‌ కుమార్‌ మాట్లాడారు. ప్రోటోకాల్‌ ను అనుసరించి ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. కరోనా వారియర్లను కూడా అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. వీఐపీలు వచ్చే రూట్లను డ్రోన్ల సాయంతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది ఒక చోట గుమిగూడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు మరో పోలీస్‌ అధికారి తెలిపారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని మాత్రమే ప్రధానికి సెక్యూరిటీగా ఉంచనున్నట్లు తెలిపారు.

మోదీ కోసం చేనేత కార్మికుడి వస్త్రం..

రామ మందిర భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని మోదీ కోసం వారణాసిలోని ఓ నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించారు. 'జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్' అని ఆ వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్రం ప్రత్యేకతను నేత కార్మికుడు బచ్చేలాల్ ఆదివారంనాడు మీడియాకు వివరించారు. మెటిరీయల్, డిజైన్ ఈ వస్త్రం గొప్పతనమని.. దీనిపై జైశ్రీమ్, అయోధ్య పవిత్ర థామ్ అని రాసి ఉంటుందన్నారు. రాముడి ధనుస్సు కూడా ఇందులో డిజైన్ చేసినట్టు చెప్పారు. కాటన్, సిల్క్ దారాలతో ఈ క్లాత్ తయారు చేశామని, వస్త్రం తయారికీ 15 రోజులు పట్టిందన్నారు.

Untitled 2 Copy

Next Story