ఆగస్టు 5న.. విదేశీ ఎంబసీలకు బికనేరీ లడ్డూలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2020 2:46 PM GMT
ఆగస్టు 5న.. విదేశీ ఎంబసీలకు బికనేరీ లడ్డూలు

కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థానంగా బావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబువుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరో 50 మంది అతిథిలు పాల్గొననున్నారు.

అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా అయోధ్యలో స్వీట్ల పంపిణీతో పాటు ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు బికనేరి లడ్డూలను బహూకరించాలని నిర్ణయించుకుంది. ఒక్కో ప్యాకెట్‌లో నాలుగు లడ్డుల చొప్పున ఉంటాయని ట్రస్ట్ పేర్కొంది. అలా.. పంపిణీ నిమిత్తమై 4 లక్షల లడ్డూల ప్యాకెట్లను సిద్ధం చేసింది ట్రస్ట్.

ఆగ‌స్టు 3వ తేదీన గ‌ణేశుడి పూజ‌తో కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయ‌ని ట్ర‌స్ట్ స‌భ్యుడు డాక్ట‌ర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగ‌స్టు 5వ తేదీన గ‌ర్భ‌గుడిలో జ‌రిగే పూజ కోసం 11 మంది పండితులు వేద‌మంత్రాలు చ‌ద‌వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ చేత భూమిపూజ చేప‌ట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్‌ నిర్ణయించింది.

Next Story