మంచు లక్ష్మీని వదలని వర్మ
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి కేంద్రం దేశ వ్యాప్తంగా 21రోజుల పాటు లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావడం లేదు. సెల్రబెటీలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో వారు సరదాగా ఉంటున్న వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.,
ఈ క్రమంలో ఓ సరదా వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు ఆర్జీవీ. వీడియోలో ఓ చిన్నపాపను వాళ్ల అమ్మ..’ఒంటికి బలమొస్తది..మిల్క్ తాగుతావా’ అని అడుగుతుంది. అప్పుడు ఆ పాప మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తూ రిప్లై ఇస్తుంది. ఆ వీడియోను నెటిజన్లతో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ..” కరోనా నుంచి కాస్తా గ్యాప్ తీసుకొండి. ఈ పాప ఎవరని ఇమిటేట్ చేసిందే తెలిస్తే నాకు చెప్పండి” అంటూ ట్వీట్ చేసాడు.
ఇక వర్మ ట్వీట్ చూసిన మంచు లక్ష్మీ ‘సార్’ అంటూ నవ్వుతోన్న ఎమోజీస్ పెట్టింది. ఇక నెటీజన్లు ఊరుకుంటారా.. లక్ష్మీని ఇమిటేట్ చేస్తున్న మరిన్ని టిక్‌టాక్ వీడియోలను నెటిజన్లు షేర్ చ్తేస్తున్నారు. ఎప్పుడు ఎవరిపై వంగ్యస్త్రాలు వదులుతారో తెలియని ఈ వివాదస్పద దర్వకుడు తాజాగా మంచు లక్ష్మీని టార్గెట్ చేసి ఆటపట్టించాడు.