క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నిబంధ‌న‌లు ఉల్ల‌గించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారి వివ‌రాల‌ను సేక‌రించిన ఆరోగ్య‌శాఖ అధికారులు.. వారి ఇళ్ల‌లో త‌నిఖీలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఇంట్లో సోమ‌వారం ఆక‌స్మాత్తుగా ఆరోగ్య శాఖ అధికారులు త‌నిఖీలు చేశారు. చెన్నైలో విజయ్ నివాసం ఉంటోన్న నీలంకరి నివాసానికి వెళ్లిన అధికారులు.. విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత వారి ఇంట్లో కుటుంబ సభ్యులెవరు ఈ మహమ్మారి బారిన పడలేదని వారు నిర్ధారించారు. కాగా ఇటీవలే విజయ్‌ విదేశాలకు వెళ్లి రాగా.. ఆయన మినహా మిగిలిన కుటుంబ సభ్యులెవరు ఆరు నెలలుగా విదేశాలకు వెళ్లలేదని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంట్లో శానిటైజర్‌ స్ప్రే చేసి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్ర‌స్తుతం ఈ వార్త తమిళనాట వైరల్ గా మారింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.