కరోనా ప్రభావంతో పనిలేక, కుటుంబాన్ని పోషించుకోలేని సినీ కార్మికులను ఆదుకునేందుకు సిసిసి (కరోనా క్రైసిస్ ఛారిటీ)ను స్థాపించారు. ఈ సంస్థకు మెగాస్టార్ చిరంజీవి చైర్మన్ గా ఉన్నారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవీనే మొదట రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు తమవంతు విరాళాలను అందించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కార్మికుల కోసం సిసిసి కి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే స్టైలిష్ స్టార్ అర్జున్ రూ.20 లక్షల విరాళాన్నివ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు తెలుగు రాష్ట్రాలకు, పీఎం సహాయనిధికి విరాళాలను అందించారు. ప్రభాస్ రెండు తెలుగురాష్ట్రాలకు కలిపి రూ. కోటి, కేంద్రానికి రూ.3 కోట్లు ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ రూ. కోటి 25 లక్షలను అందించారు. తాజాగా సిసిసికి ఇచ్చిన విరాళాలతో కలిపి కరోనా పై పోరాటానికి ప్రభాస్ రూ.4.5 కోట్లు, అల్లు అర్జున్ రూ.1.25 కోటి ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటారు.

Also Read : తాటిబెల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా ?

అదేవిధంగా యూవీ క్రియేషన్స్ రూ.10 లక్షలు, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రూ.75 వేలు, నిర్మాత కరాటం రాంబాబు రూ. లక్ష, దర్శకుడు సతీష్ వేగేశ్న రూ.50 వేలు సిసిసి కి అందజేశారు. ఈ కష్టకాలంలో కార్మికులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమని సతీశ్ వేగేశ్న పేర్కొన్నారు.

Also Read : ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి మందు బాబులు..!

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.