వర్మ నెక్ట్స్ మూవీ ‘అల్లు’

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 1:15 PM IST
వర్మ  నెక్ట్స్ మూవీ ‘అల్లు’

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌గోపాల్ వర్మ. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ మూతపడినా ఆర్జీవీ కంపెనీ మాత్రం క్లోజ్ అవలేదు. కరోనా మహమ్మారిని కూడా లెక్క చేయకుండా వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు ఆర్జీవీ. రీసెంట్‌గా ఆయన 'పవర్‌ స్టార్'‌ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన చిత్రాన్ని ప్రకటించాడు. ఆ చిత్రం పేరు 'అల్లు' అని తెలిపాడు. ఈ సినిమా కూడా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో రాబోతుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.



కాగా ''అల్లు'' అనే సినిమా ఓ పెద్ద స్టార్ హీరో కుటుంబానికి వెనుక నుండి ఓ బామ్మర్ది ఏమి చేసాడు అనే ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనుంది.. ఆ స్టార్ హీరో “జన రాజ్యం” పార్టీని ప్రకటించిన తర్వాత స్టోరీ మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. వర్మ ఇంకా ఈ సినిమా గురించి చెప్తూ.. అల్లు అనే టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ అల్లు తూ వుంటాడు. ‘త‌న‌కు మంచి జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు, మ‌రొక‌డికి చెడు జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు.. అనే స్ట్రాట‌జీతో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన త‌న బావ ప‌క్క‌నే ఉంటూ త‌న మైలేజీ ప‌డిపోకుండా ఉండ‌టానికి త‌మ ఇంటి అల్లుడును కూడా మ‌ర్చిపోయి ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు. అంద‌రితో త‌న‌ను 'ఆహా' అనిపించుకోడానికి త‌న‌కు కావాల్సిన వాళ్ల‌కే మంచి జ‌రిగేలా చెప్పి, ప్లాన్‌ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లిక‌ల మాస్ట‌ర్ క‌థే ఈ అల్లు’ అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలోని పాత్ర‌ల పేర్ల‌‌ను కూడా వెల్ల‌డించారు. ఈ సినిమాలో ఎ. అర‌వింద్‌, కె. చిరంజీవి, ప్ర‌‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ. ఆర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌. చ‌రర‌‌ణ్‌, ఎన్.‌ బేబు త‌దిత‌రులు ఉంటార‌ని తెలిపారు. త‌న‌కు ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని, త‌న‌ను నికృష్టుడు అని పిలిచిన దానికి ప్ర‌తీకారం కాద‌ని వర్మ స్ప‌ష్టం చేశారు.



Next Story