రామ్‌చరణ్ ఫోటో వైరల్.. అభిమానులు ఫిదా
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2020 5:39 PM ISTమెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'(రౌధ్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఇక చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన లుక్‌ను రిలీల్ చేశారు.
తాజాగా రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫోటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. చరణ్ లుక్ పై అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనికి 'బీ ది బెస్ట్ పాజిబుల్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్' అని క్యాప్షన్ ను జోడించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబర్ తో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించి ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు చరణ్ సన్నాహకాల్లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.