ఇవాళ జరిగే రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ఓటు ఎవరికి?

By సుభాష్  Published on  19 Jun 2020 3:40 AM GMT
ఇవాళ జరిగే రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ఓటు ఎవరికి?

ఓవైపు మాయదారి రోగం విరుచుకుపడుతున్న పరిస్థితి. మరోవైపు జరగాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు జరగాల్సిన రీతిలో జరిగిపోతున్నాయి. ఇవాళ ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం చోటు చేసుకోనుంది. నాలుగు రాజ్యసభ స్థానాలకు పోటీ జరుగుతుండగా ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బలం లేకున్నా.. తన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపటం ద్వారా పోలింగ్ తప్పనిసరైంది.

ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు సాగనుంది. ఏపీలోని అసెంబ్లీ కమిటీ హాల్ ఒకటిలో పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. వాస్తవానికి ఈ పోలింగ్ మార్చి 26న జరగాల్సి ఉంది. మహమ్మారి తీవ్రత నేపథ్యంలో పోలింగ్ ను వాయిదా వేశారు. పోలింగ్ ముగిసిన రెండు గంటల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇది చదవండి: నేటి నుంచి ఆ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

రాజ్యసభలో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.. పరిమళ్ నత్వాని.. పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణారావులు పోటీలో ఉండగా.. తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య బరిలోకి నిలిచారు. తాజాగా జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించనున్నారు. ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేసింది బ్యాలెట్ ను పరా్టీ నిర్దేశించిన ప్రతినిధికి చూపించి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఇది చదవండి: రూ.50వేల కోట్లలో భారీ ప్యాకేజీ.. 20న ప్రారంభించనున్న మోదీ

ఒకవేళ పార్టీ చెప్పిన అభ్యర్థికి కాక పొరపాటున ఓటు వేస్తే అది చెల్లదు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో అభ్యర్థి 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. ఏ రీతిలో చూసినా.. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదు. కానీ.. అభ్యర్థిని మాత్రం బరిలో నిలిపారు. వాస్తవానికి ఈ ఎన్నిక ఏకగ్రీవం కావాల్సింది. పోలింగ్ అవసరం లేదు. విపక్షం పుణ్యమా అని పోలింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈరోజు జరిగే పోలింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కమ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటును ఎవరికి వేయాలన్న విషయంపై స్పష్టతకు వచ్చారు. తన ఓటును బీసీ అభ్యర్థికి వేయాలని నిర్ణయించారు. బరిలో నిలిచిన వారిలో ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కేటాయించినట్లుగా తెలుస్తోంది. తన ఓటును ఎవరికి వేయాలన్న విషయాన్ని తానే స్వయంగా డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పిల్లి సుభాశ్ చంద్రబోస్ కు క్లీన్ చిట్ ఉండటం.. సమకాలీన రాజకీయాల్లో పాత తరానికి ప్రాతినిధ్యం వహించే నేతగా ఆయనకున్న పేరు అందరికి తెలిసిందే.

ఇది చదవండి: ఆ నాలుగు జిల్లాల్లో మద్యం కోసం పరుగులు.. ఎందుకో తెలిస్తే..

Next Story
Share it