కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌కుమార్
By తోట వంశీ కుమార్Published on : 1 Sept 2020 2:03 PM IST

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది. రాజీవ్ కూమార్..1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.
అనంతరం పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన రాజీవ్ కుమార్ ఆగస్టు 31 వరకు ఆ పోస్టులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎన్నికల కమిషనర్‌గా నియమించడంతో మంగళవారం ఆ బాధ్యతలు చేపట్టారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన విధులు నిర్వర్తించనున్నారు.
Next Story