సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
By సుభాష్ Published on 21 July 2020 3:57 PM ISTరాజస్థాన్‌లో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 24వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్థాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
పైలట్‌తో సహా మరో 18 మందికి నోటీసులు జారీ చేసే సమయంలో స్పీకర్ ఎలాంటి కారణాలు చూపకుండానే నోటీసులు జారీ చేశారని, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వాటిపై స్పందించేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారని రోహత్గీ వాదించారు. కాంగ్రెస్ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో స్పీకర్ జోషి వీరికి అనర్హత నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ తిరుగుబాటుదారు సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణన కోర్టు తీర్పునిచ్చింది.