ద‌ర్శ‌క బాహుబ‌లి 'రాజ‌మౌళి'కి క‌రోనా

By Medi Samrat  Published on  30 July 2020 3:24 AM GMT
ద‌ర్శ‌క బాహుబ‌లి రాజ‌మౌళికి క‌రోనా

క‌రోనా ఎవ్వ‌రిని వ‌ద‌ల‌ట్లేదు. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ ఎస్. ఎస్.‌ రాజమౌళికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గడిచిన‌ నెల‌ రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే బిగ్‌బీ.. అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక బిగ్‌బీ తప్పించి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కరోనా నుంచి కోలుకున్నారు.

తాజాగా రాజమౌళికి జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు మూడు రోజులుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కొద్దిపాటి జ్వ‌రం వుండ‌టంతో టెస్టులు చేయించుకున్నాం. ఆ రిపోర్టులో తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల‌ సలహా మేరకు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండనున్నట్టు ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లను కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా రాజ‌మౌళి కోరారు.ఇదిలావుంటే.. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మ‌ల్టీస్లార‌ర్‌ ఆర్ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. సౌతిండియ‌న్ బాష‌ల‌తో పాటు.. హిందీలో కూడా విడుద‌ల కానున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో ఆసక్తి నెలకొంది. 2021 జ‌న‌వ‌రి 8న ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తున్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా విడుద‌ల‌లో జాప్యం జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువున్నాయ‌నే టాక్ విన‌ప‌డుతోంది. ఈ విష‌య‌మై చిత్ర యూనిట్ అపీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కూ ఇటువంటి ఊహాగానాల‌కు తెర‌ప‌డ‌దు.

Next Story