'ఆర్ఆర్ఆర్' తరువాత మహేష్‌తో జకన్న సినిమా..!
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 8:12 PM ISTటాలీవుడ్‌లో ఇప్పటి వరకు అపజయం ఎరుగని అతికొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయనతో పని చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకదీరుడు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక.. తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని జక్కన్న స్పష్టం చేశాడు. ఈచిత్రానికి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలిపాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్నాడు అనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఓ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో అవన్నీ వట్టి రూమర్లని తేలిపోయాయి. కాగా.. రాజమౌళి ఇప్పటి వరకు ఒక సినిమా చేస్తుండగా.. తన తదుపరి సినిమా గురించి ఇప్పటి వరకు వెల్లడించలేదు.
'ఆర్ఆర్ఆర్' చేస్తుండగానే మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ సందర్భంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మహేష్ బాబుకు సెట్ అయ్యే విధంగా తన దగ్గర ఓ మంచి స్టోరీ లైన్ ఉందని.. దానిని డెవలప్ చేస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో విడుదలైన ప్రత్యేక వీడియోతో 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మరొ సర్‌ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.