స‌న్నీలియోన్‌ డైప‌ర్ మాస్క్‌.. ఐడియా అదిరింది గురూ..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2020 6:51 AM GMT
స‌న్నీలియోన్‌ డైప‌ర్ మాస్క్‌.. ఐడియా అదిరింది గురూ..!

క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ ను విధించారు. దీంతో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో తాము ఏం ప‌నులు చేస్తున్నామో సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. కొంద‌రు హీరోయిన్లు హాట్ హాట్ ఫోటోల‌తో హీట్ పెంచుతుండ‌గా.. గ్లామ‌ర్ డాల్ స‌న్నీలియోన్ మాత్రం వెరైటీ ప్ర‌యోగాలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తొంది.

ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లాలంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మాస్క్ త‌ప్ప‌నిస‌రి. దీంతో మార్కెట్ లో మాస్కుల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. కొంద‌రు భారీగా ధ‌ర‌లు పెంచి అమ్ముతుండ‌గా.. చాలా మందికి మాస్కులు దొర‌క‌డం లేదు. ఇక త‌ప్ప‌ని స‌రిగా వెళ్లాల్సిన ప‌రిస్థితిలో.. కొంద‌రు క‌ర్ఛీఫ్, దుప్ప‌ట్టా ఎవరికి తోచిన‌ట్లు వారు ముఖాన్ని క‌ప్పుకుంటున్నారు.

Sunny wear diaper face mask

తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌న్నిలియోన్ స‌రికొత్త మాస్కుల‌ను త‌యారు చేశాన‌ని అంటోంది. ఆ మాస్కుల‌ను ధ‌రించి ఉన్న ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది అమ్మ‌డు. ఆ ఫోటోల్లో స‌న్ని త‌న ముఖానికి డైప‌ర్ చుట్టుకొని ఉంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డైప‌ర్ల‌ను ఎమ‌ర్జెన్సీ మాస్కులుగా వాడుకొవాల‌ని సూచించింది. ఇంకో ఫోటోలో పేస్‌కి మాస్కుతో పాటె బాక్సింగ్ గ్లౌజుల‌ను తొడుక్కొని ఉంది. మ‌రో ఫోటోలో స్పైడ‌ర్ మ్యాన్ మాస్క్, ల‌య‌న్ మాస్క్ ధ‌రించి ఉంది. ఈ ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇది చూసిన కొంద‌రు అభిమానులు స‌న్నీకి ఏమైంది అని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. సన్ని లియోన్ అస‌లు ఉద్దేశ్యం మాత్రం క‌రోనా నుంచి ర‌క్షించుకోవడానికి మాస్కుల‌ను ధ‌రించ‌మ‌ని చెప్ప‌డ‌మే.

Next Story
Share it