కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 2:51 PM IST
విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఏపీలోని నదులు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. తూర్పు, ఈశాన్యం నుంచి గాలుల వీస్తున్న నేపథ్యంలో మరోసారి వర్షం పలకరించాడికి వస్తోంది. తూర్పు, ఈశాన్యం నుంచి వీస్తున్న గాలులతో రాగల రెండు, మూడు రోజులు అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణ నెలకొంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాలో శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
Next Story