రైల్వే బోర్డు కీలక నిర్ణయం..ఏప్రిల్ 14 వరకు రిజర్వేషన్లపై నిషేధం

By రాణి  Published on  25 March 2020 1:10 PM GMT
రైల్వే బోర్డు కీలక నిర్ణయం..ఏప్రిల్ 14 వరకు రిజర్వేషన్లపై నిషేధం

రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఆ తర్వాత కూడా రిజర్వేషన్లు చేసుకునే విషయంపై ఏప్రిల్ 12వ తేదీన ఒక ప్రకటన చేస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.

Also Read : ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ పై టాలీవుడ్ ప్రముఖులు ఏమన్నారంటే..

కేంద్ర వైద్యారోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటి వరకూ 562 కరోనా కేసులు నమోదవ్వగా..9 మంది మృతి చెందారు. మరో 41 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 20 వేలకు చేరింది. ఇటలీ, ఇరాన్ లలో కరోనా మరణ మృదంగం ఇంకా ఆగలేదు. చైనా వెలుపల అన్ని దేశాలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి.

Also Read : ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్

తెలంగాణలో 31 వరకూ లాక్ డౌన్ ఉండటంతో..హైదరాబాద్ లోని హాస్టళ్లన్నింటినీ మూసివేశారు. తెలుగు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో ఇంటికెళ్లే దారిలేదు. పైగా..అన్ని పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ లన్నింటినీ ఆపివేశాయి. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. దీంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్ ఉద్యోగులంతా సొంత ఊళ్లకు వెళ్లే వెసులుబాటు లేక పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. సొంతఊళ్లకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ రాయదుర్గం, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి పీఎస్ ల వద్ద బారులు తీరారు. ఇలా పీఎస్ ల వద్దకు వచ్చిన హాస్టల్స్ లో ఉండేవారికి పోలీసులు అనుమతి లేఖలు ఇస్తున్నారు. వీరిని సొంతఊళ్లకు పంపేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారు. సొంతవాహనాలున్నవారు..చెక్ పాయింట్లలో అనుమతి లేఖను చూపించి స్వస్థలాలకు వెళ్లవచ్చన్నారు.

Next Story