ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఉగాది సందర్భంగా అభిమానుల కోసం సినిమా మోషన్ పోస్టర్, టైటిల్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ లను విడుదల చేసింది. ఈ పోస్టర్ తెలుగు, హిందీతో పాటు, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. దీంతో అటు తారక్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. కాగా..చిత్ర మోషన్ పోస్టర్ పై టాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

Also Read : ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్

ముందుగా చిరంజీవి..ఈ మోషన్ పోస్టర్ వీడియోను చూడగానే స్పందించారు. ”ఇప్పుడే ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ చూశా. చూడగానే ఒళ్లు గగుర్పొడిచింది. కీరవాణి అందించిన సంగీతం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి, తారక్, చరణ్ పనితీరు ఇంకా అద్భుతం. ఉగాది రోజున చిత్రం మోషన్ పోస్టర్ అందరిలో నూతన ఉత్తేజాన్ని నింపింది.” అని చిరంజీవి ట్వీట్ చేయగా..జక్కన్నస్పందించారు. చిత్ర పోస్టర్ పై మీరు స్పందించడం చాలా సంతోషంగా ఉంది. ఉగాది శుభాకాంక్షలు. ట్విట్టర్ కు స్వాగతం అని రిప్లై ఇచ్చారు.

తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వరుసగా నిరుత్సాహంగా వార్తలొస్తున్న నేపథ్యంలో చిత్రం పోస్టర్, లుక్స్ విడుదల చేసి కొత్త ఉత్తేజాన్ని నింపారు రాజమౌళి. రాబోయే మంచి విషయాల కోసం కూడా ఎదురుచూడాలి. కరోనా వైరస్ వంటి భయంకరమైన విషయాలు న్నాయి. ఆర్ ఆర్ఆర్ వంటి మంచి విషయాలు కూడా ఉన్నాయి అని ట్వీట్ చేశారు.

దర్శకుడు వివి వినాయక్ ఆర్ఆర్ఆర్ టైటిల్ పోస్టర్ పై స్పందించారు. బ్రిటిష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్న రౌద్రం, ఆ ఇద్దరూ కలిసి చేయాలనుకున్న రణం, ఆ యుద్ధంలో వాళ్లు అర్పించిన రుధిరం.

Also Read : అమెరికా: 2 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ప్యాకేజీ

ఇక హీరోలు అఖిల్, వరుణ్ తేజ్ లు కూడా దీనిపై స్పందించారు. ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, పోస్టర్ చాలా బాగుందని చెప్పారు అఖిల్. నిప్పు, నీరు ఇది చాలా ఆసక్తికరంగా ఉందని వరుణ్ తేజ్ అన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.