ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్

By రాణి  Published on  25 March 2020 10:42 AM GMT
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్

ఆన్ లైన్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటి నుంచి ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వస్తువులు బెంగళూరు, ముంబై నుంచి రావాల్సి ఉంది. అక్కడికి వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. కరోనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు. విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది భారత ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ కార్ట్ లాజిస్టిక్స్ కూడా మూతపడ్డాయి. వినియోగదారులకు ఇవ్వాల్సిన వస్తువుల ద్వారా కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదమున్నందున ఆన్ లైన్ దిగ్గజాలు డెలివరీలను ఆపివేశాయి. కేవలం మెడిసిన్ సంబంధిత వాటిని మాత్రమే డెలివరీ చేస్తామని అమెజాన్ ప్రకటించింది.

Also Read : ఆత్మహుతి దాడి.. 27 మంది మృతి

అలాగే కొత్తగా ఎలాంటి ఆర్డర్లను స్వీకరించట్లేదు. దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చేంత వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం ఉదయానికి కరోనా కేసులు 562కు పెరిగాయి. మృతుల సంఖ్య 11కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది.

Also Read :ఇన్ స్టా లో కొత్త ఫీచర్..ప్రత్యేకంగా వారికోసమే..

Next Story