మంత్రి తలసానిని క‌లిసిన 'బిగ్‌బాస్-3' విజేత‌

By Medi Samrat  Published on  9 Nov 2019 12:06 PM GMT
మంత్రి తలసానిని  క‌లిసిన బిగ్‌బాస్-3 విజేత‌

తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ కలిశారు. మాసబ్‌ట్యాంకులోని మంత్రి కార్యాల‌యంలో రాహుల్.. మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ‘బిగ్‌బాస్‌-3’లో రాహుల్‌ విజేతగా నిలవడం పట్ల మంత్రి తలసాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

ఇటీవల ముగిసిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 గ్రాండ్ ఫినాలేలో యాంకర్ శ్రీముఖితో పోటీపడిన రాహుల్‌.. చివరికి విజేతగా నిలిచారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా షో వ్యాఖ్యాత నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించారు.

Next Story
Share it