'రాహు' సినిమా ట్రైలర్ లాంచ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 11:57 AM GMT
రాహు సినిమా ట్రైలర్ లాంచ్..!

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'రాహు'. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న 'రాహు' ట్రైలర్ ని దర్శకుడు వీరు పోట్ల లాంచ్ చేశారు. సిధ్ శ్రీరామ్ పాడిన "ఏమో ఏమో " పాట వన్ మిలియన్ వ్యూస్ ని సాధించి 'రాహు' పై అంచనాలు పెంచింది. చిత్ర యూనిట్ తో పాటు, మధుర శ్రీధర్ , రచయిత బి వి యస్ రవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ... మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి థాంక్స్ . 'రాహు' అంటే అందరూ జాతకాలు స్టోరీ అనుకుంటున్నారు. కానీ మా స్టోరీ అది కాదు. హీరోయిన్ కి ఒక డిజార్డర్ ఉంటుంది, అది ఒక రాహు లాంటిది. అలాగే తన జీవితంలో మరో 'రాహు' బయట ఉంటాడు. ఈ రెండు సమస్యల పై తాను చేసిన పోరాటమే 'రాహు' కథ. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ కథను తెరకెక్కించాం. నాకు సహకరించిన టీమ్‌కి ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ కృతి మాట్లాడుతూ... "రాహు మూవీ నాకు చాలా స్పెషల్, నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు కి చాలా థాంక్స్. నాకు ఈ పాత్ర కు చాలా ఛాలెంజ్ గా ఉంది. ... టీజర్ బాగా రీచ్ అయి నందుకు చాలా అందంగా ఉంది" అన్నారు.

హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ... " దర్శకుడు సుబ్బు కి చాలా థాంక్స్. రాహు టీం లో చాలా ఎనర్జీ ఉంది. ఈ టీం తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందం గా ఉంది. ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్" అన్నారు.

Next Story