రహానె సెంచరీ.. డబుల్‌ సెంచరీ దిశగా రోహిత్‌ అడుగులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 6:19 AM GMT
రహానె సెంచరీ.. డబుల్‌ సెంచరీ దిశగా రోహిత్‌ అడుగులు

రాంచీ వేదికగా భారత్‌- సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. 224/3 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్‌ దూకుడుగా ఆడుతున్నారు. మ్యాచ్‌లో రహానె సెంచరీ సాధించాడు. 169 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టి రహానె సెంచరీ చేశాడు. టెస్ట్‌ కెరీర్‌లో అజింక్య రహానేకు ఇది 11వ సెంచరీ. 115 పరుగుల వద్ద లిండే బౌలింగ్‌లో రహానే ఔట్‌ అయ్యాడు. క్రీజులో కొనసాగుతున్న రోహిత్‌ శర్మ మాత్రం డబుల్‌ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే 160కిపైగా పరుగులు పూర్తి చేసి హిట్‌మ్యాన్‌ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాపై 150పై పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. మూడో టెస్టులో కూడా భారీ స్కోరు దిశగా భారత్‌ కదం తొక్కుతోంది. ఇప్పటికే 300 మార్కును భారత్‌ జట్టు అధిగమించింది.

Criket Criket1

Next Story
Share it