నీవల్లే ఇదంతా.. కాదు నీవల్లే అంటూ..
By తోట వంశీ కుమార్ Published on 13 Sept 2020 10:19 AM ISTడ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయినట్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు బెంగళూరులోని మడివాళ మహిళ సంరక్షణ కేంద్రంలో ఉన్నారు. ఇద్దరిని ఓకే గదిలో ఉంచారు. కాగా.. ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. నీ వల్లంటే.. నీ వల్లే అంతా జరిగింది అంటూ పోట్లాడుతున్నారని తెలిసింది.
ఇక ఈ ఇద్దరు నాయికలకు బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ కోణంలోనూ విచారణను మొదలు పెట్టారు. వారిద్దరిని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు సాగుతుండడంతో కేసు నమోదు చేసినట్లు కర్ణాటక, గోవాలకు చెందిన ఈడీ అధికారులు తెలిపారు. సీసీబీ కస్టడీలో ఉ్న వీరేశ్ ఖన్నా, రాహుల్, ప్రశాంత్ రంగా, ప్రతీక్ శెట్టిలను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. వారిని తమ కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టును అర్థించారు.
ఇదిలావుంటే.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన రవిశంకర్, రాహుల్, వైభవ్ జైన్, ప్రశాంత్ రంకా, నియాజ్, ప్రతీక్ శెట్టిలకు కేసీ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు, రక్తం, మూత్రం, తల వెంట్రుకల నమూనాలను సేకరించి ల్యాబరేటరీకి పంపించారు. బంగారం వ్యాపారి అయిన వైభవ్ జైన్ ను రాగిణి ద్వివేదికి సన్నిహితుడిగా అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. శనివారం రాగిణి ద్వివేది చేసిన పనిలో అధికారులు అగచాట్లు పడ్డారు. పరీక్షల నిమిత్తం మూత్రం ఇవ్వాలని వైద్య సిబ్బంది చిన్న సీసా ఇవ్వగా.. రాగిణి అందులో నీళ్లు నింపి ఇచ్చింది. అసలు విషయం తెలిసాక అధికారులు ఆమెపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఓ మహిళా పోలీస్ సాయంతో మరోసారి ఆ పరీక్షలు నిర్వహించారు.